గిరిజనుల తీజ్‌ పండుగకు ప్రత్యేక గుర్తింపు

– విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-మహేశ్వరం
గిరిజనుల తీజ్‌ పండుగకు ప్రత్యేక గుర్తింపు ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం హర్షగూడ గ్రామంలో తీజ్‌ పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితాహరినాథ్‌ రెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొన్నేండ్ల నుంచి బంజార మహిళలు తీజ్‌ పండుగను పెద్ద ఎత్తున నిర్వహిస్తారని తెలిపారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. అత్యంత పవిత్రంగా జరుపుకునే తీజ్‌ పండుగను పురస్కరించుకుని గిరిజన సోదరీమణులకు మంత్రి తీజ్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ విజరుకుమార్‌, ఉపసర్పంచ్‌ రవినాయక్‌, తుక్కుగూడ కౌన్సిలర్‌ బాధావత్‌ రవినాయక్‌, దేవానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love