నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
సిరిసిల్లసిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ ఎన్ వి కృష్ణయ్య వర్ధంతి సందర్భంగా శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఏఐఎఫ్టియు న్యూజిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఆల్ ఇండియా కేత్ మజ్దూర్ కిసాన్ సభ జాతీయ మహాసభలకు వెళ్లినటువంటి నాయకులు ఎన్ వి కృష్ణయ్య వర్ధంతి సందర్భంగా అక్కడే విడిది కేంద్రంలో ఏ ఐ ఎఫ్ టి యు న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ సోమిశెట్టి దశరథం అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగినది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐఎఫ్టియు న్యూ జాతీయ సహాయ కార్యదర్శి కామ్రేడ్ సాహి మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ మోడం మల్లేశం లు పాల్గొనగా.. ఈ సమావేశాన్ని ఉద్దేశించి కామ్రేడ్ సోమిశెట్టి దశరథం మాట్లాడుతూ .. కామ్రేడ్ ఎన్ వి కృష్ణయ్య 1989లో ఎమ్మెల్యేగా ఎన్నికై సిరిసిల్ల ప్రాంతంలో మచ్చలేని నాయకునిగా కార్మికుల పక్షపాతిగా పేద ప్రజల పక్షపాతిగా దోపిడి వర్గాలకు వ్యతిరేకంగా అవినీతి రహితంగా సమ సమాజ నిర్మాణం కోసం అంతరాలు లేని సమాజం కోసం నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం కోసం తన ఊపిరి ఉన్నంతకాలం సిపిఐ ఎంఎల్ పార్టీలో కొనసాగుతూ పోరాటం కొనసాగించినారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ కార్యాలయంలో తడక రాములు గుజ్జ దేవదాస్ ఆఖేన సత్తయ్య నారాయణ పాల్గొన్నారు.
సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యేకు ఘన నివాళి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES