నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
బాల్య వివాహాల నిర్మూలన కొరకు స్కోప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేది నుండి 14వ తేది వరకు జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సహకారంతో జిల్లాలోని హిందూ దేవాలయాలు, మసీదులు, చర్చిలలో నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా శనివారం చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో గ్రామ పెద్దలు చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సంస్థ మండల కోఆర్డినేటర్ బి.నరసింహరాజు మాట్లాడుతూ.. బాల్య వివాహాలు ఎక్కడ జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా చొరవ తీసుకోవాలన్నారు. ఎక్కడైతే రహస్యంగా జరుగుతున్నట్లు మీ దృష్టికి వస్తే ఆ సమాచారాన్ని ప్రభుత్వం యంత్రాంగానికి, చైల్డ్ లైన్ అధికారులకు మరియు టోల్ ఫ్రీ నెంబర్లకు1098,100,112 సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన అర్చకుడు శేషాచార్యులు కోడెం రాములు, చిన్నం చిన్నప్ప, చౌట శ్రీనివాస్, నారాయణ తదితరులు పాల్గొన్నారు
బాల్యవివాహాల నిర్మూలనపై విసృత ప్రచారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES