నవతెలంగాణ – కామారెడ్డి
నాగిరెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోల చోరి కేసులో ఇద్దరు అంతర్‌జిల్లా దొంగలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయం ఏర్పాటు చేసే విలేకరుల సమావేశమైన మాట్లాడుతూ.. తేదీ 11/12-09 -2025 న రాత్రి సమయంలో గోపాల్పేట గ్రామానికి చెందిన తాడేపల్లి కృష్ణ తన ఆటో దొంగతనం గూర్చి ఇచ్చిన ఫిర్యాదులో తేది 11/12.09.2025 నా రాత్రి సమయంలో తన డ్రైవర్ అయిన అనిష్ యొక్క ఇంటి ఆవరణంలో పార్కింగ్ చేసిన తన బజాజ్ పాసెంజర్ ఆటో గోల్డెన్ ఎల్లో కలర్ నెంబర్ టి ఎస్ 15 యూసి 4621 ను ఎవరో గుర్తు తెలియని దొంగలు రాత్రి సమయం లో గేటు తాళం పగల కొట్టి దొంగిలించినారు అని పిర్యాదు చేశాడన్నారు. ఈ విషయం లో క్రైమ్ నెంబర్ . 124/2025 యు, ఎస్ 331(4),305 బి ఎన్ ఎస్, పోలీస్ స్టేషన్ నాగిరెడ్డి పేట లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగిందన్నారు.
ఎల్లారెడ్డి డి.ఎస్.పి, ఎస్, శ్రీనివాస్ పర్యవేక్షణలో ఒక బృందం, సిఐ ఎల్లారెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ల సారద్యం లో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయడం జరిగినదన్నారు. ఈ కేసు దర్యాప్తు లో భాగంగా శనివారం ఉదయం వాహన తనిఖిల్లో భాగంగా మల్తుమ్మెద గేటు వద్ద తనిఖీలు చేస్తున్న పోలిస్ సిబ్బందిని చూసి పారిపోతుండగా కానిస్టేబుల్ బి. గంగారం (పోలీస్ కానిస్టేబుల్ – 1692) హోమ్ గార్డ్ యం. బాలాజీ (హోంగార్డు – 152) లు వారిని వెంబడించి పట్టుకున్నారు.
అనంతరం విచారించగా నిందితులు అయినటువంటి నిజాంబాద్ జిల్లా, గోపాల్ మండలం, మంచిప్ప గ్రామానికి చెందిన కుమ్మరి ( కనుగుల ) రాజు (ఇతని పైన మొత్తం 20 కేసులు కలవు, వాటి వివరాలు కరీంనగర్ జిల్లా లో- 12, జగిత్యాల జిల్లా లో -3, నిజామాబాదు జిల్లా లో -3, కామారెడ్డి, మెదక్ జిల్లా లలో ఒక్కొక్క కేసు కలవు ) రెండవ నిందితుడైన నిజామాబాద్ జిల్లా, నిజాంబాద్ మండలం , గోపాన్ పల్లి గ్రామానికి చెందిన కొల్ల దుర్గరాజు, (ఇతని పై మెదక్ జిల్లా లో ఒక కేసు కలదు) నిందితులు నాగిరెడ్డిపేట లో దొంగిలించిన ఆటోను, మెదక్ లో దొంగతనం చేసిన రెండు ఆటో లు, భిక్కనుర్ లో దొంగతనం చేసిన ఒక ఆటో ను మొత్తం 4 ఆటోలు లను కూడా స్వాదినం చేసుకోవడం జరిగిందన్నారు.
వాటి విలువ సుమారు 2,45,000 వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఇద్దరి దొంగల నుండి రెండు మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ దర్యాప్తులో భాగంగా నిందితులను పట్టుకోవడము లో చాకచక్యంగా, సమయస్పూర్తి తొ వ్యవహరించి నిందితులను పట్టుకున్న ఎల్లారెడ్డి సిఐ, సిసిఎస్ ఇన్స్పెక్టర్ టీం లను, నాగిరెడ్డిపేట్ కానిస్టేబుల్ బి, గంగారం పోలీస్ కానిస్టేబుల్ 1692 , యం. బాలాజీ హోంగార్డ్. 152 లను అభినందించడం జరిగిందన్నారు.