Saturday, September 13, 2025
E-PAPER
Homeఆదిలాబాద్అంగన్వాడీల సంక్షేమం పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం

అంగన్వాడీల సంక్షేమం పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం

- Advertisement -

అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణకుమారి
జిల్లాలో అసోసియేషన్ నాలుగవ మహాసభలు
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్

పేద వర్గాల్లోని పోషకాహార లోపాన్ని తొలగించి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో అహర్నిశలు పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సంక్షేమం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణకుమారి అన్నారు. శనివారం ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా 4వ మహాసభలను పట్టణంలోని యాదవ సంఘ భవనంలో నిర్వహించారు.

సంఘం ఆద్వర్యంలో చేపట్టిన పోరాటాలు, సాధించుకున్న హక్కులు, భవిశ్యత్ ఉద్యమ కార్యచరణపై చర్చించి తీర్మాణాలు చేశారు. కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేని మారుమూల గ్రామాలకు, వానాకాలంలో వాగులు దాటుకుంటూ చిన్నారులు, బాలింతులు, గర్భిణీలు, కిషోరబాలికలకు క్రమం తప్పకుండా పోషకాహారం అందిస్తున్న ఘనత అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ లది అని అన్నారు. చిన్నారులను బడికి తీసుకొస్తూ బలవర్ధకమైన ఆహారం అందిస్తూ ప్రీ ప్రైమరి బోధన చేస్తున్న అంగన్వాడీ టీచర్ల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు అశ్రద్ధ వహిస్తున్నాయన్నారు.

యేళ్లుగా పోరాడిన ఫలితంగా ఈ మాత్రమైనా వేతనాలు వస్తున్నాయన్నారు. తీరిక లేని పని ఒత్తిడితో సతమతం చేస్తున్న ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామి మేరకు 18 వేల వేతనాన్ని అమలు చేయడం లేదన్నారు. సంఘటిత పోరాటాల ద్వారా కనీస వేతనం, ఉద్యోగ భద్రత సాదించుకుందామని పిలుపునిచ్చారు. ఈ మహాసభల్లో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రకళా, సరస్వతి, వనమాల, కన్యాకుమారి, చాయ, రాధ, ఏఐటీయూసి నాయకులు దేవేందర్, గాజంగుల రాజు, కేశవ్ పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -