Saturday, September 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సెంట్రల్ లైట్ వెలిగేదెప్పుడు?

సెంట్రల్ లైట్ వెలిగేదెప్పుడు?

- Advertisement -

నవతెలంగాణ – సదాశివనగర్
మండలంలో ని పద్మాజి వాడి చౌరస్తాలో ఏర్పాటుచేసిన సెంట్రల్ లైట్స్ వెలిగేది ఎప్పుడు అని ప్రయాణికులు చర్చించుకుంటున్నారు. సంవత్సరం గడిచిన ఇప్పటివరకు వెల్తురుకు నోచుకోని సెంట్రోలైట్స్ ఈ లైట్స్ లేకపోవడంతో రాత్రిపూట వాహనాలకు కనిపియడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ లైట్ వెలగోకపోవడంతో దొంగతనాలు జరిగే ఆవకాశం ఉందని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. రాత్రి పూట సరిగా వెల్తురు కనిపియ్యలేదని ఆరోపిస్తున్నారు.  జాతీయ రహదారి అధికారులు టోల్ గేట్ మీద ఉన్న శ్రద్ద ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని అంటున్నారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జి లేకముందు సెంట్రల్ లైట్స్ మంచిగా వెలిగేయని అంటున్నారు.  ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ఒక్కరోజు కూడా సెంట్రల్ లైట్స్ వెలగలేదని ప్రయాణికులు తెలిపారు.  సెంట్రల్ లైట్స్ కూడా ప్రారంభిస్తే ఎంతో బాగుంటుందని అంటున్నారు ఇప్పటికైనా  44వ జాతీయ రహదారి అధికారులు స్పందించి సెంట్రల్ లైట్స్ ప్రారంభించాలని కోరుతున్నారు రాత్రిపూట లైట్స్ లేకపోవడంతో భయాందోళనకు గురవుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -