- Advertisement -
నవతెలంగాణ – నసురుల్లాబాద్
ఇటీవలే కురుస్తున్న వర్షాలకు రహదారులు గుంతలమయంగా మారాయి. ఇది చోట నసురుల్లాబాద్ మండల కేంద్రంలో బాన్సువాడ నిజాంబాద్ వెళ్లే రహదారిపై పెద్ద గుంత పడడంతో ద్విచక్ర వాహనదారులు గుంతల పడి ఒక సంచి ఏదైనా గాయాల పాలయ్యారు. రహదారి ధ్వంసమవడంతో ఆయా గ్రామాలకు వెళ్లే వాహనాదారులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. మెయిన రోడ్డుపై గుంతలు ప్రమాదకరంగా మారింది.
ఈ రోడ్డుపై ఏర్పడిన గుంతలను గుర్తించేందకు స్థానికులు ఆ గుంతల్లో సంచి ఉంచారు. ఈ రహదారిపై నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు.
- Advertisement -