నవతెలంగాణ – ధర్మసాగర్
నిరుపేద కుటుంబంలో పుట్టి దశాబ్దల పాటు పేదలకు సేవలు అందిస్తున్న గంగాపురం ఆదం సేవలు చిరస్మరణీయమని,ఆ కుటుంబం నిరంతరం ప్రజల కోసం పనిచేస్తుందని సీనియర్ జర్నలిస్టు, పద్మశాలి సంఘం రాష్ట్ర మీడియా కార్యదర్శి చింతకింది కృష్ణమూర్తి,సాంఘిక సేవ సంస్థ స్వచ్ఛంద సంస్థ కోనేటర్ చిట్యాల దయాకర్ కొనియాడారు. శనివారం ధర్మసాగర్ మండల కేంద్రంలో ఆదం దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ దశాబ్దల కాలం పాటు పేద ప్రజల అభ్యుదయంకై వృద్ధులకు వితంతువులకు నిరుపేదలైన ప్రజలకు చీరలు చెద్దర్లు అందిస్తున్నారని వివరించారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా గంగాపురం కుటుంబం అండగా నిలిచిందని ఆ కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేశారు. మారుమూల పల్లె ప్రాంతంలో దళిత కుటుంబంలో పుట్టిన వారి కుమారుడు గంగాపురం అమృతరావ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందారనీ ఈ సందర్భంగా వివరించారు.
గంగారపు ఆదం సేవలు చిరస్మరణీయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES