చెక్క వెంకటేష్.. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు
నవతెలంగాణ – ఆలేర్ రూరల్
భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పెద్ద ఎత్తున పోరాటాలు సాగించిన ఆరుట్ల కమలాదేవి,రామచంద్రారెడ్డి దంపతులు నేటి యువతకు ఆదర్శమని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్ అన్నారు. తెలంగాణ సాయుధ రైతంగ పోరాట వారోత్సవాలను పురస్కరించుకొని శనివారం మండలంలోని కొలనుపాక గ్రామంలోని ఆరుట్ల దంపతుల స్థూపాలకు పూలమాలవేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతంగా పోరాటంలో విరోచితంగా పోరాడి ఎంతోమంది పేదలకు భూమి పంపిణీ చేసిన ఘనత ఆరుట్ల దంపతులకె దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి పున్నబోయిన రవి,నాయకులు పోతు ప్రవీణ్,ఆంజనేయులు,గ్యార బిక్షపతి, మల్లయ్య, రాములు,మాజీ సర్పంచ్ మోత్కూరి ఐలయ్య,రాజయ్య నరసింహులు పాల్గొన్నారు.
ఆరుట్ల దంపతులు నేటి యువతకు ఆదర్శం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES