నవతెలంగాణ – భిక్కనూర్
గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్నారని విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకొని తవ్వకాలు చేపడుతున్న వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించిన ఘటన మండలంలోని ర్యాగట్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామ శివారులో ఉన్న పురాతనమైన బసవేశ్వర స్వామి ఆలయం శిధిలావస్థకు చేరడంతో గ్రామస్తులు ఆలయాన్ని పునర్నిర్మానంలో భాగంగా తీసేశారు. గుడి ఉన్న స్థలంలో గుప్త నిధులు ఉన్నాయని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఇతర గ్రామాలకు చెందిన వ్యక్తులతో కలిసి శనివారం జెసిబి సహాయంతో తవ్వకాలు చేపడుతుండగా గమనించిన గ్రామస్తులు తవ్వకాలు చేపడుతున్న వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.
గుప్త నిధుల కోసం తవ్వకాలు.. కేసు నమోదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES