Sunday, September 14, 2025
E-PAPER
Homeజాతీయంబంగారం ధరలకు రెక్కలు..

బంగారం ధరలకు రెక్కలు..

- Advertisement -

నవతెలంగాణ- హైదరాబాద్: దేశంలో బంగారం ధరలు సరికొత్త శిఖరాలను తాకాయి. ఊహించని విధంగా పరుగుతూ 10 గ్రాములు బంగారం ధర రూ. 1.09 లక్షల మార్కును అధిగమించి, ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకుంది. బంగారం బాటలోనే వెండి కూడా దూసుకెళుతూ రికార్డులు సృష్టిస్తోంది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి కారణంగా మదుపరులు బంగారం, వెండిని సురక్షితమైన పెట్టుబడులుగా భావించడమే ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,09,707 వద్ద స్థిరపడింది. ఈ వారంలో సోమవారం నాటి ధర రూ. 1,08,037తో పోలిస్తే రూ. 1,670 మేర పెరుగుదల నమోదైంది. అదే విధంగా, 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఈ వారం ప్రారంభంలో రూ. 98,962 ఉండగా, శుక్రవారం నాటికి రూ. 1,00,492కి చేరింది. వెండి ధర కూడా గణనీయంగా పెరిగింది. సోమవారం కిలో వెండి ధర రూ. 1,24,413 ఉండగా, శుక్రవారానికి రూ. 3,595 పెరిగి రూ. 1,28,008కి చేరుకుంది. ఈ నెల ప్రారంభం నుంచి వెండి ధర రూ. 1.20 లక్షలపైన కొనసాగుతోండటం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -