Sunday, September 14, 2025
E-PAPER
Homeసినిమాఅన్ని విషయాలు పంచుకునేలా పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వాలి

అన్ని విషయాలు పంచుకునేలా పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వాలి

- Advertisement -

‘మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. సోషల్‌ మీడియాలో పిల్లల మీద అబ్యూజ్‌ చేస్తున్నారు. అలాంటి కామెంట్లు చేస్తే కూడా లైక్స్‌ చేస్తున్నారు.. నవ్వుతున్నారు.. అవన్నీ చూస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. మనం ఇలాంటి సమాజాన్ని కోరుకుంటున్నామా?’ అని హీరో సాయి దుర్గ తేజ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 70 నగరాలు, వేల మంది యంగ్‌ ప్రొఫెషనల్స్‌ కలిసి కాన్పిడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండిస్టీ (సిఐఐ) భాగంగా యంగ్‌ ఇండియన్స్‌ (వైఐ) ఆధ్వర్యంలో పిల్లలపై లైంగిక దాడికి వ్యతిరేక నినాదంతో ‘అభయమ్‌ మసూమ్‌ సమ్మిట్‌’ ఈవెంట్‌ శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. భారత్‌ రైజింగ్‌, యంగ్‌ ఇండియన్స్‌, కాన్పిడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండిస్టీ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి హీరో సాయి దుర్గ తేజ్‌, మంత్రి సీతక్క, యంగ్‌ ఇండియన్స్‌ కో చైర్మన్‌ భవిన్‌ పాండ్య, యంగ్‌ ఇండియన్స్‌ నేషనల్‌ చైర్మన్‌ తరంగ్‌ ఖురానా, సీఐఐ తెలంగాణ ఛైర్మన్‌ శివ ప్రసాద్‌ రెడ్డి, జోత్స్న సింగ్‌ వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో సాయి దుర్గ తేజ్‌ మాట్లాడుతూ,’ఇప్పుడు పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువ సమయాన్ని గడపడం లేదు. తమతో అన్ని విషయాల్ని పంచుకునేలా పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వాలి. పిల్లలకు ప్రతీ విషయాన్ని ప్రేమతో చెప్పాలి. గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ విషయాల్ని స్కూల్లో టీచర్స్‌, ఇంట్లో పేరెంట్స్‌ తెలియజేయాలి’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -