మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సీఐటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మీ సేవా ఉద్యోగుల వేతనాలు పెంచాలనీ, వారి సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్ ఇన్‌చార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్‌తో పాటు మీ సేవా రాష్ట్ర నాయకులు కవిత, ప్రకాశ్, రాజు, బాలకృష్ణ కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. కనీస వేతనాలు పెంచాలనీ, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ మీ సేవా కేంద్రాలు అద్భుతంగా పనిచేస్తున్నాయనీ, ప్రజలకు అనేక సేవలను అందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని సీఎం, ఐటీ శాఖ మంత్రి పలు మార్లు చెప్పారని గుర్తు చేశారు. మీ సేవా సర్వీస్లుల్లో ప్రజల సౌకర్యార్ధం ప్రవేశపెడుతున్న అనేక సేవల వల్ల పని భారం పెరుగుతున్నప్పటికీ పట్టుదలగా శ్రమిస్తున్నామని తెలిపారు. రెండేండ్ల నుండి కనీస వేతనాలు పెంచలేదనీ, బ్రేక్ లేకుండా పీఎఫ్ ఖాతాలు కొనసాగించాలని కోరారు. వార్షిక బోనస్ లేదా ఇన్సెంటీవ్ కూడా చెల్లించలేదని తెలిపారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా జీతాలు పెంచాలనీ, రూ. పది లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను వెంటనే అమలు చేయాలనీ, వార్షిక బోనస్, ఇన్సెంటీవ్ ప్రతి ఏడాది చెల్లించాలని డిమాండ్ చేశారు. అదనపు సిబ్బందిని నియమించాలనీ, ఆయా కేంద్రాల్లో కస్టమర్లకు కనీస సౌకర్యాలు మెరుగు పర్చాలని విజ్ఞప్తి చేశారు.
మీ సేవా ఉద్యోగుల వేతనాలు పెంచాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES