Sunday, September 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు 

వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు 

- Advertisement -

నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
మండల కేంద్రంలోని కంశేట్ పల్లి సమీపంలో వాహనాలను నసురుల్లాబాద్ పోలీసులు ఆదివారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నసురుల్లాబాద్ పోలీస్ సిబ్బంది  బాన్సువాడ-నిజామాబాద్ వెళ్లే రహదారిపై వెళ్లే వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వాహనదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని అన్నారు. మైనర్లకు వాహనాలను తల్లిదండ్రులు ఇవ్వవద్దని, అలాగే సరైన పత్రాలు లేని వాహనాలను, నంబర్ ప్లేట్లు లేకుండా రోడ్డు పై నడిపిస్తే సీజ్ చేస్తామని తెలిపారు. అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని, వాహనాలకు ఉన్న పెండింగ్ చలాన్లు కట్టివేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -