Sunday, September 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అట్రాసిటీ కేసు నమోదు చేయాలి..

అట్రాసిటీ కేసు నమోదు చేయాలి..

- Advertisement -

-రేగులపల్లిలో వాటర్ ట్యాంకెక్కి ఎస్సీ కుటుంబ సభ్యుల అందోళన 
– ఎస్ఐ చొరవతో దిగొచ్చిన ఆందోళనకారులు
నవతెలంగాణ – బెజ్జంకి

కబ్జాదారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మండల పరిధిలోని కల్లేపల్లి గ్రామానికి చెందిన ఓ ఎస్సీ సామాజిక వర్గ కుటుంబ సభ్యులు రేగులపల్లి అనుబంధ గ్రామం వెంకట్రావుపల్లి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకెక్కి ఆదివారం అందోళన చేపట్టారు. కల్లేపల్లిలో పలువురు ఎస్సీ సామాజిక వర్గాలకు ప్రభుత్వమందించిన భూమిలో కబ్జాదారుడు పూడ్చిన మృతదేహాన్ని అధికారులు తొలగించి  లబ్ధిదారులకు న్యాయం చేయాలని అందోళనకారులు డిమాండ్ చేశారు. ఘటన స్థలానికి ఎస్ఐ సౌజన్య సిబ్బందితో చేరుకుని  అందోళనకారుల డిమాండ్ ను పరిశీలిస్తామని సూచించడంతో అందోళనకారులు ట్యాంక్ పై నుండి దిగొచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -