– పొట్లపల్లిలో నివాళులు అర్పించిన అఖిలపక్ష నాయకులు
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ నియోజకవర్గంలో 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో పదవులు ఆశించకుండా పేద ప్రజలకు సంక్షేమం కోసమే పనిచేసిన నాయకుడు కర్ర శ్రీహరి మృతి చెందడం వేద ప్రజలకు తీరని లోటని అఖిలపక్ష నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లి గ్రామంలోని బురుజు వద్ద ఆయన చిత్రపటానికి పార్టీలకు అతీతంగా నివాళులు అర్పించారు. శనిగరం గ్రామ సర్పంచ్, కోహెడ ఎంపీపీగా జెడ్పిటిసిగా టిడిపి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా టిడిపి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కేసిఆర్ తర్వాత బిఆర్ఎస్ పార్టీలో చేరి తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాకాల శ్యాంసుందర్ గౌడ్, దేవసాని నరసింహారెడ్డి, కొమ్మర నరసింహారెడ్డి, చింతకింది వెంకటస్వామి, నాంపల్లి శంకర్, కర్ర రవీందర్ రెడ్డి ,రాసపల్లి శంకర్, వేముల సంపత్ రెడ్డి ,రాదండ్ల రాజయ్య, జాగిరి చంద్రమౌళి, మంద సుదర్శన్ రెడ్డి ,బండి కొమురెల్లి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు .
కర్ర శ్రీహరి మృతి.. పేద ప్రజలకు తీరనిలోటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES