నవతెలంగాణ – నసురుల్లాబాద్
నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో బాన్సువాడ, నిజామాబాద్ వెళ్లే రహదారిపై ఏర్పడిన గుంతను ఆదివారం అధికారులు పూడ్చారు. శనివారం నవతెలంగాణ పత్రికలో ( గుంతను పూడ్చారా ) అనే వార్తకు స్పందించిన రోడ్డు భవనాల శాఖ అధికారులు స్పందించి కంకర చిప్ వేసి పూడ్చారు. బాన్సువాడ, నిజామాబాద్ వెళ్లే రహదారి గుంతలు ఏర్పడంతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. రెండు రోజుల కు ఒకరు గుంటలో పడుతున్నారు. ఒక వాహనం వెళ్లిన తరువాత మరో వాహనం వెల్లవాల్సివస్తుంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురైతున్నారు. దీనితో నేడు గుంతలను పూడ్చివేశారు. దీనితో గుంతలు పూడ్చిన జాతీయ రహదారుల నిర్మాణ కాంట్రాక్టర్ మరియు అధికారులకు గ్రామస్తులు అభినందించారు.
నవతెలంగాణ వార్తకు స్పందన ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES