- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తనిఖీలు చేశారు. ఆదివారం మిలాద్ ఉల్ నబీ ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన నగరంలోని ఆయా ప్రాంతాల్లో బందోబస్తు చర్యలను పరిశీలించారు. ర్యాలీ రూట్ మ్యాప్ పరిశీలించారు. ఈ ర్యాలీ నెహ్రూ పార్క్ వద్దకు వచ్చే సమయం అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా మిగతా ప్రాంతాల నుంచి వచ్చే రూట్ మ్యాప్ ని పూర్తిగా పరిశీలించారు. ఈ ర్యాలీ ఎన్ని గంటల వరకు పూర్తి అవుతుందో ర్యాలీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టూ టౌన్ ఎస్సై సయ్యద్ ముజాహిద్ ఆయన వెంట ఉన్నారు.
- Advertisement -