Sunday, September 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా గురుశిష్యుల ఆత్మీయ సమ్మేళనం

ఘనంగా గురుశిష్యుల ఆత్మీయ సమ్మేళనం

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
నగరశివారులోని బోర్గాం(పి) జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల 1991 -92 సంవత్సరం పూర్వ విద్యార్థుల గురుశిస్యుల ఆత్మీయ సమ్మేళనం కిసాన్ మున్నూరు కాపు కల్యాణమండపంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. 33 సంవత్సరాల తర్వాత విద్యార్థులందరూ ఒకే వేదికను పంచుకోవడంతో పాటు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ చెమర్చిన కళ్లు.. చెదరని జ్ఞాపకాలు.. చిలిపి చేష్టలు.. అల్లరి పనులను గుర్తుచేసుకు న్నారు. పూర్వ విద్యార్థి, సినీ రచయిత బండోజి సతీష్ తన వ్యాఖ్యానంతో ఆకట్టుకుంటూ గురుశిస్యుల ఆత్మీయ సమ్మేశనాన్ని ఆహ్లాదపరిచాడు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు.ఎక్కడెక్కడో స్థిరపడ్డ విద్యార్థులు ఇలా ఒక్కచోట హాజరై రోజంతా ఉల్లాసంగా గడిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రామకృష్ణ, లక్ష్మినారాయణ గౌడ్,గంగప్రసాద్,  మహేందర్,గంగాధర్,మహీపాల్, సుదర్శన్, దశరథం సాయరెడ్డి, రాజ్యలక్ష్మి సుజాత, నాగలక్ష్మి, మాధవి,గంగామణి, శివ మాధవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -