Sunday, September 14, 2025
E-PAPER
Homeఆదిలాబాద్బాధితుల కుటుంబాలకు అండగా ఉంటా..

బాధితుల కుటుంబాలకు అండగా ఉంటా..

- Advertisement -

ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్
నవతెలంగాణ – ముధోల్ 

ప్రమాదవశాత్తు ఇండ్లు  కాలిపోయిన బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మోహన్ రావు ప్రజా ట్రస్ట్ చైర్మన్ బోస్లే మోహన్ రావు పటేల్ అన్నారు. ముథోల్ మండలంలోనిబోరిగాంగ్రామానికిచెందిన లక్ష్మీబాయి అనే మహిళకు చెందిన ఇల్లు ఇటీవల షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయింది. దీంతోఈవిషయంతెలుసుకున్న మోహన్ రావు ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లేమోహన్ రావుపాటిల్ ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో తక్షణ సాయంగా ఆర్థికసాయం అందజేశారు. ముధోల్ నియోజకవర్గంలో అనుకొనిసంఘటనలు జరిగినప్పుడు  ట్రస్ట్ అండగాఉంటుందన్నారు. ఇప్పటికే ముధోల్ నియోజకవర్గం ఇండ్లు కాలిపోయిన బాధిత కుటుంబాలకు తక్షణ సాయంతో పాటు, పేద కుటుంబాలకు రేకుల ఇల్లు నిర్మించిఇవ్వటం జరిగిందన్నారు.

పాముకాటు, ప్రమాదవశాత్తు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ట్రస్ట్ తరఫున పది వేలు రూపాయల చొప్పున ఆర్థికసాయం చేస్తున్నమన్నారు. తమ ట్రస్టు పేద ప్రజలకోసంనియోజకవర్గంలో ఎల్లప్పుడూ పనిచేస్తుందన్నారు. ఏదైనాసమస్యతలెత్తిన తమ దృష్టికి తీసుకువస్తే పేద ప్రజలకోసంసమస్య పరిష్కారంఅయ్యేంతవరకు తమ ట్రస్ట్ అండగాఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలోమాజీఎంపిపి సుభాష్ జాదవ్, బొరిగాం మాజీ సర్పంచ్ తులసి బాయి, స్థానిక నాయకులు  కిష్టయ్య, గణేష్ గౌడ్, యువకులు, మహిళలు,తదితరులు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -