నవతెలంగాణ – మోర్తాడ్
జిల్లాలో యూరియా కొరత ఉందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని బాల్కొండ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లాతోబాటు రాష్ట్రంలో యూరియా కొరత ఉందని తప్పుడు ప్రకటనలు చేసి తన స్థాయిని దిగజార్చుకోవడం సరికాదని బిఆర్ఎస్ ప్రభుత్వం అందించిన దానికంటే అధికంగానే రైతులకు యూరియా అందిస్తున్నప్పటికీ పెద్ద రైతులు యూరియా కొత్తతో అధికంగా తీసుకోవడంతో చిన్న రైతులకు యూరియా అందకపోవడం జరుగుతుందని అన్నారు. 23- 24 సంవత్సరంలో 35,459 వేల తనుల యూరియా సరఫరా చేస్తే ప్రస్తుతం 24 -25 సంవత్సరానికి గాను 42,832 వేల మెట్రిక్ టన్నుల సరఫరా చేయడం జరిగిందని ఆ విషయాన్ని తెలుసుకోకుండా తప్పుడు ఆరోపణలు చేయడం తన స్థాయికి తగదని అన్నారు.
పాలకొండ నియోజకవర్గంలో సైతం గత సంవత్సరానికంటే 2 వేల మెట్రిక్ టన్నుల యూరియా సహకార సంఘాలకు అందివ్వడం జరిగిందని అన్నారు. కెసిఆర్ తన అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఉచితంగా ఎరువులను అందిస్తామని ఎక్కడ అందించాడని అన్నారు. పది సంవత్సరాలు పాలనలలో ఉన్న కేసీఆర్ ప్రశాంత్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు మరి రైతులకు ఉచితంగా ఎరువులను అందివ్వలేదని ఇప్పుడు కొరత అంటూ తప్పుడు ప్రకటనలు చేయడం తగదని అన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో అర్హులైన వారికి మంజూరైన చెక్కులు పంపిణీ చేయకుండా లబ్ధిదారులను ఇబ్బందుల పాలు చేస్తున్న ఎమ్మెల్యే తన పదవికి సైతం న్యాయం చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచే చేస్తున్నాడని అన్నారు. ఎన్నికల కంటే ముందు అడపాదడపా నిధులు లేకుండానే పోసిటింగ్ కాపీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన తాను ఇప్పుడు ప్రజల పక్షాన నిలిచినట్టు తప్పుడు ప్రకటనలతో ప్రజాధరణ పొందాలని అనుకోవడం తన అవివేకానికి ఆదర్శమని అన్నారు.
సహకార సంఘాలలో కొనుగోలు చేసిన వరి ధాన్యాలలో అధిక మొత్తంలో కడతా పేరుతో రైతులను దోచుకుతిన్న మీరు రైతు పక్షాన ఉంటున్నామని అనడం ఏమిటని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా యూరియా సరఫరా చేస్తూ మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని ఎలాంటి కడతా లేకుండా పూర్తిస్థాయిలో రైతులకు న్యాయం చేస్తున్న ప్రజా పాలన ప్రభుత్వం అని అన్నారు. నిజాంబాద్ జిల్లాలో 25 సహకార సంఘాలలో అవినీతి ఆరోపణలు రాగా బాల్కొండ నియోజకవర్గంలోని 12 అవినీతికి పాల్పడిన నిర్ధారణలు అయినాయని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఏ మేరకు అక్రమాలు జరిగాయో ప్రజలు గమనించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరసయ్య, వేణుగోపాల్ యాదవ్, దేవ రెడ్డి, శివ నల్ల శివకుమార్ పాల్గొన్నారు
యూరియా కొరత లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES