Sunday, September 14, 2025
E-PAPER
Homeఆదిలాబాద్సంఘ నిర్మాణ బలంతోనే సమస్యల పరిష్కారం

సంఘ నిర్మాణ బలంతోనే సమస్యల పరిష్కారం

- Advertisement -

పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్

సంఘ నిర్మాణం ఎంత బలంగా ఉంటుందో అంత సులువుగా సమస్యల పరిష్కరం ఉంటుందని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి అన్నారు. ఆదివారం పీఆర్టీయూ టీఎస్ భవనంలో సంఘ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అథితిగా హాజరై పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యలపై తీర్మాణాలు తీసుకున్నారు.  ఈ సందర్భంగా పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ… సంఘ నిర్మాణం బలంగా ఉంటేనే సమస్యలను అంతే సులువుగా సమస్యలను పరిష్కరానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా సర్వసభ్య సమావేశాలు నిర్వహించి సమస్యలపై తీర్మాణాలు తీసుకుంటున్నామని తెలిపారు. 33 జిల్లాల్లో వచ్చిన వాటిని రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరగుతుందన్నారు. సంఘం తరుపున ఉద్యమాల ఫలితంగా ఎంప్లాయిస్ హెల్త్ స్కీం నూతన కార్డులను మరో 15 అందించనున్నట్టు పేర్కొన్నారు. 2024 నాటికి జిల్లాలో 1500 ఉన్న సభ్యుత్వాలుంటే నేడు 1800 అయ్యాయని తెలిపారు. దీనికి జిల్లా కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కృష్ణకుమార్, ప్రధాన కార్యదర్శిస్వామి, రాష్ట్ర, జిల్లా, మండల బాధ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -