Sunday, September 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సెప్టెంబర్ 17న సాయుధ పోరాట దినోత్సవంగా నిర్వహించాలి

సెప్టెంబర్ 17న సాయుధ పోరాట దినోత్సవంగా నిర్వహించాలి

- Advertisement -

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎశాల అశోక్..
నవతెలంగాణ – భువనగిరి

సెప్టెంబర్ 17 న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రైతాంగ సాయుధ పోరాట దినోత్సవం జరపాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్ డిమాండ్ చేశారు. ఆదివారం సెప్టెంబర్ 11 నుండి 17 వరకు జరిగే తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా భువనగిరి మండలంలోని బస్వాపురం గ్రామంలో గల రైతాంగ సాయుధ పోరాట నాయకులు ముదిగొండ జమ్మయ్య దుర్గపతి గౌరయ్య వర్రె నరసయ్యల స్థూపానికి నివాళులర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశానికి 1947 ఆగస్టు 15 వ తేదీన స్వాతంత్రం వచ్చినప్పటికిని తెలంగాణకు స్వాతంత్ర్యం రాలేదన్నారు.

నైజాం ప్రభుత్వం ఆధీనంలోనే తెలంగాణ రాష్ట్రం ఉన్నదన్నారు. నైజాం ప్రభుత్వం గ్రామాలలో ప్రజలచే వెట్టిచాకిరి చేయిస్తూ పండించిన పంటను  దక్కకుండా చేస్తుండటంతో కమ్యూనిస్టు పార్టీ నాయకులు రావి నారాయణరెడ్డి, మగ్దూం మొహినుద్దీన్ బద్దం ఎల్లారెడ్డి లు సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారన్నారు. ఈ పిలుపుని అందుకుని ప్రజలంతా ఎక్కడికక్కడ నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎర్రజెండాలు చేతబట్టి దున్నేవాడికే భూమి కావాలని, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం వీరోచితంగా తుపాకులు పట్టుకొని పోరాటాలు కొనసాగించినారన్నారు. ఈ పోరాటం ప్రపంచంలోనే మహత్తరమైన పోరాటమని ఈ పోరాట చరిత్రను నేటి ప్రభుత్వం పాఠ్యపుస్తకాలలో ప్రచురించి నేటి తరానికి ఆ ఉద్యమ చరిత్ర తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని అన్నారు.

సిపిఐ మండల కార్యదర్శి దాసరి లక్ష్మయ్య మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటాన్ని బిజెపి  హిందూ, ముస్లిం పోరాటంగా మతం రంగుతో వక్రీకరిస్తున్నారన్నారు. అప్పుడు బిజెపి పార్టీ పుట్టలేదని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఐసహాయ కార్యదర్శి ఉడుత రాఘవులు, సిపిఐ గ్రామ కార్యదర్శి ముదిగొండ ఠాగూర్, సహాయ కార్యదర్శి ముసునూరి చంద్రశేఖర్, నాయకులు రాసాల బాలస్వామి, రాసాల నరసింహ, మర్రి నరసయ్య, చిక్క బిక్షపతి, ముదిగొండ జమ్మయ్య, నోముల ఐలయ్య, ముదిగొండ మహేష్, ముదిగొండ బసవయ్య, మద్దెపురం బాల నరసింహ, ఉడుత విష్ణు, మచ్చ వీరయ్య, ఉడుత బాలరాజ్, అంకం చక్రపాణి, అంకం నగేష్, కొన్నే బుచ్చయ్య పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -