Sunday, September 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అనాధ వృద్దుడికి అంత్యక్రియలు నిర్వహించిన ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ

అనాధ వృద్దుడికి అంత్యక్రియలు నిర్వహించిన ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
మానవత్వమా నీవేక్కడ ఈ ప్రశ్నకు సమాధానం వెత్తుకునే పరిస్థితి ఐనావాళ్ళు వద్దనుకున్నారో ఏమె వదిలేసి వెళ్లిపోయారు. అంత్యక్రియలకు నోచుకోక కోన్ని రోజులుగా ఆ శవం అలా ఉండిపోయింది పురుగులు చీమలు పట్టి కుళ్ళిపోయింది. ప్రాణం వదిలే ఆ క్షణం ఆ వృద్దుడు ఎంతటి నరకయాతన పడ్డాడో ఏమె పాపం, చనిపోయాక కూడా ఎవరు చూడక ఐనా వారు ఎవరు దగ్గర లేక ప్రాణం వదిలేసాడు పాపం ఎవరు లేక ఎవరు రాకపోవటంతో ఇందల్వాయి ఎస్.ఐ  ఆ అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించమని ఆదివారం ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థను కోరగా సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు కోశాధికారి జయదేవ్ వ్యాస్, నరేష్ రెడ్డి ఇందల్వాయి పోలిస్ సిబ్బంది ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -