నవతెలంగాణ – అచ్చంపేట
పట్టణంలో గౌతమి హై స్కూల్ క్రీడా ప్రాంగణంలో ఆదివారం జిల్లా స్థాయి షూటింగ్ బాల్ సెలక్షన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి జిల్లా స్థాయి సెలక్షన్స్ లో 70 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 24 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ సెలక్షన్స్ లకు ఎంపిక అయినట్లు షూటింగ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లేష్ కార్యదర్శి రాఘవేందర్ ను తెలిపారు. ఈనెల 22,23,24 తేదీల్లో మూడు రోజులపాటు మహబూబాబాద్ జిల్లాలో 44 వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాల,బాలికల షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ లు జరగనున్నాయి. రాష్ట్రస్థాయి పోటీలో మంచి క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరిచి జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకొని రావాలని తెలియజేశారు. కార్యక్రమంలో పిఈటి శివకుమార్, మల్లేష్, శ్రీను, పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి సెలక్షన్ కు 24 మంది ఎంపిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES