నవతెలంగాణ – దామరచర్ల
వెల్ఫేర్ బోర్డును కార్మికులు వినియోగించుకోవాలని సిఐటియు మండల కార్యదర్శి దయానంద్ కోరారు. దామరచర్ల మండల కేంద్రంలో ఆదివారం జరిగిన భవన నిర్మాణ కార్మికుల మండల మహాసభ లో ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో మన భవన నిర్మాణ కార్మికులు చాలామంది వెల్ఫేర్ బోర్డులో పేరు నమోదు చేయించుకోక పోవడం దురదృష్టకరం అన్నారు. అది మన సాధించుకున్నటువంటి చట్ట మని దానిని భవన కార్మికులు వినియోగించుకోవాలని కోరారు. కాన్పులకు , పెళ్ళికానుక రూ లక్ష ఇవ్వాలని , ఆక్సిడెంట్ మరణానికి రూ పది లక్షలు , సహజ మరణానికి ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఇతరత్రా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు . అనంతరం దామరచర్ల భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా పల్లా సుదర్శన్, ఉపాధ్యక్షులుగా కొమ్ము రాజేష్ , గుండ్లపల్లి ఆంజనేయులు , ప్రధాన కార్యదర్శి గా బైరం దయానంద్ , సహాయ కార్యదర్శి గా భుఖ్య విజయ్ , కోశాధికారి కోట నరేందర్ క కమిటీ సభ్యులు గా ఎం నరసింహ రావు బి సైదులు, ఏ బ్రహ్మయ్య మాలోత్ రమేష్, రమణమ్మ, పేరు పొంద గోపి తదితరులు పాల్గొన్నారు.
వెల్ఫేర్ బోర్డును సద్వినియోగం చేసుకోవాలి: సీఐటీయూ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES