నవతెలంగాణ – రెంజల్
మండలంలో కూరగాయల సాగు ఆశాజనకంగా ఉంది. మండలంలో సుమారు 300ల ఎకరాలలో రైతన్నలు కూరగాయ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. వారు పండించిన పంటను మార్కెట్కు తరలించి లాభాలు పొందడానికి నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. హార్టికల్చర్ అధికారులు కూరగాయ సాగు చేసే రైతన్నలకు మరింత అవగాహన కల్పించి, సబ్సిడీపై పరికరాలను అందించినట్లయితే సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది. కూరగాయ సాగు పై అధికారులు అవగాహన కల్పించి వారికి సిమెంట్ పోల్స్ అందించాలని మాజీ మంత్రి, పి. సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది.
రైతులు అవగాహన కల్పించే ప్రభుత్వం ద్వారా వచ్చే సబ్సిడీని వివరించినట్లయితే వారు మరింత కూరగాయల విస్తీర్ణం పెంచే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. మండలంలో గోపి వంకాయ, బెండకాయ, టమోటా, పాలకూర, మెంతం కూర, తో పటు, ప్రత్యామ్నాయ పంటగా మునగ మొక్కలను తమ గేట్ల పై పెంచుకుంటున్నారు. సాగు చేసే రైతులకు సిమెంట్ పోల్స్ లేకపోవడంతో వారు వెదురు బొంగులో సహాయంతో తమ పంటను రక్షించుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. పంటపై రైతులకు అవగాహన కల్పించాలని స్థానిక రైతులు కోరుతున్నారు.
ఆశాజనకంగా కూరగాయల సాగు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES