Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లారీ లోడ్ యూరియాను పక్కదారి పట్టించిన ఎమ్మెల్యే గన్ మెన్

లారీ లోడ్ యూరియాను పక్కదారి పట్టించిన ఎమ్మెల్యే గన్ మెన్

- Advertisement -

ఎమ్మెల్యే యూరియా కోసం అధికారులకు ఫోన్ చేయడంతో గన్‌మెన్ తతంగం బహిర్గతం.
నవ తెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రవ్యాప్తంగా యూరియా కోసం రైతులు ఆందోళన చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి  గన్ మెన్ ఎమ్మెల్యే పి.ఎ.గా నటిస్తూ వ్యవసాయ అధికారులకు ఫోన్ చేసి యూరియా లారీ లోడును సొంత గ్రామం కుక్కడంకు మళ్లించిన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ నేపధ్యంలో గత పది రోజుల క్రితం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పంపించాలని చెప్పినట్లుగా గన్ మెన్ పీఏ గా వ్యవహరిస్తూ అధికారులకు ఫోన్  చేశారు. దీంతో అధికారులు సైతం లారీ లోడ్ యూరియాను కుకడం గ్రామానికి పంపించారు. తాజాగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తమ నియోజకవర్గానికి యూరియా పంపించాలని అధికారులు కోరగా పది రోజుల క్రితం పంపించడం జరిగిందని సమాధానం రావడంతో అవాక్కయ్యారు. ఈ సంధర్భంగా గన్‌మెన్ నాగు నాయక్ వ్యవహారం బయటికి వచ్చింది. విషయం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కు తెలియడంతో విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -