Sunday, September 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పలు గ్రామాల్లో బాధిత కుటుంబాలకు పరామర్శ

పలు గ్రామాల్లో బాధిత కుటుంబాలకు పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని పలు గ్రామాల్లో బాధిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించారు. కోనాపూర్ గ్రామానికి చెందిన బడాల లింగారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు.

 అదే గ్రామానికి చెందిన తెడ్డు గంగారం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.మండలంలోని కోనసముందర్ గ్రామానికి చెందిన భిక్షపతి ఇటీవల గుండె పోటుతో మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం పరిచారు. అదే గ్రామానికి చెందిన బద్దం కిషన్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. మృతుల అనారోగ్యాల గల కారణాలను వారి వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, డైరెక్టర్ జైడి శ్రీనివాస్, మాజీ సింగల్ విండో చైర్మన్ చిన్నోళ్ల రెడ్డి, హాయ్ ఆ గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -