- Advertisement -
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
తంగళ్లపల్లి మండలం కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్వెల్ఫేర్ మహిళ డిగ్రీకళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో లక్ష్మిపూర్ గ్రామంలో ఆదివారం ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యుల వివరాలు, విద్యా స్థాయిలు, జీవనోపాధి, ఆరోగ్య పరిస్థితులు, ప్రభుత్వ పథకాల లబ్దిదారుల వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి వాణిశ్రీ మాట్లాడుతూ ఇలాంటి సర్వేలు వాలంటీర్లలో సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా వాలంటీర్ల చొరవను గ్రామస్తులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు.
- Advertisement -