Monday, September 15, 2025
E-PAPER
Homeఖమ్మంమాజీ సర్పంచ్ సత్యవతికి ఘన నివాళి

మాజీ సర్పంచ్ సత్యవతికి ఘన నివాళి

- Advertisement -

– దశ దిన కర్మ కు హాజరైన జారె, మెచ్చా, తాటి
నవతెలంగాణ – అశ్వారావుపేట

మండలంలోని పేరాయిగూడెం మాజీ సర్పంచ్ నార్లపాటి సత్యవతి కి తాజా మాజీ ఎమ్మెల్యేలు నివాళులు అర్పించారు. ఆమె దశ దిన కర్మను ఆదివారం పేరాయి గూడెంలో తన స్వగృహంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ,మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు సత్యవతి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.సత్యవతి భర్త నార్లపాటి రాములు ను ఓదార్చారు. కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్,టీఆర్ఎస్ నాయకులు సుంకవల్లి వీరభద్రరావు, జూపల్లి రమేష్, తుమ్మ రాంబాబు, మిండ హరిక్రిష్ణ, మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, యు.ఎస్ ప్రకాశ్ రావు,జుజ్జూరపు శ్రీరామమూర్తి, సుబ్బారావు లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -