నవతెలంగాణ కమ్మర్ పల్లి
అధిక వర్షాలు, వాతావరణంలో మబ్బులు, తేమ ఉండటం వల్ల వరి పంటలో సుడిదోమ వచ్చే అవకాశం ఉందని ఉప్లూర్ క్లస్టర్ వ్యవసాయ విస్తీర్ణ అధికారి రమేష్ తెలిపారు. రైతు సోదరులు వరి పంటలో కింద దుబ్బులో సుడిదోమ ఉందో లేదో నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. దుబ్బుకు మూడు నుంచి ఐదు ఆరు దోమలు కనిపించిన వెంటనే నివారణ మందులను స్ప్రే చేయాలన్నారు. వరి పంటలో సుడి దోమ రావడానికి ముఖ్య కారణం నాటు దగ్గర దగ్గరగా వేసుకోవడమేనన్నారు.
వరి నాట్లు దగ్గర దగ్గరగా వేసుకున్న పొలాల్లో గాలి వెలుతురు సరిగా ఆడని కారణంగా వరి పొలాల్లో ఈ సుడి దోమ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. సుడి దోమ ఉదృతి గమనించిన వెంటనే పొలంలో పైరును 2 మీటర్ల దూరంతో కాలి బాటలు తీసుకోవాలని, పొలంలోని నీటిని తీసివేసి రసాయనిక మందులను పైరు పైనుండి కిందవరకు తడిచేలా రసాయనిక మందులను పిచికారి చేయాలని సూచించారు.వరి పంటలో సుడిదోమ గమనించిన వెంటనే రైతులు నివారణ చర్యగా ఎకరం పంటకు పైమెట్రిజిన్ 50శాతం డబ్ల్యూజి 120 గ్రాములు (లేదా) టైర్ఫ్లుమెజోపైరం 10శాతం ఎస్ సి 94 మిల్లీలీటర్లు స్ప్రే చేసుకోవాలని సూచించారు.
వరి పంటలో సుడిదోమ నివారణ చర్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES