- Advertisement -
శాకోప శాఖలుగా విస్తరించిన
మహావృక్షం నిండా….
వెలుగుల్ని మింగే నీడలే
మిత్రత్వం ఒక ప్రయోజనమై
ఆప్యాయత లావాదేవీగా మారింది
స్నేహ హాసాల మధ్య దాగిన కపటత్వం
జీవనగమనాన్ని గాయపరుస్తోంది…
అవసరాల్లో చిగురించిన పూల పరిమళం
సమస్యల జడీలో వాలిపోతుంది
ఇక్కడ నిజాయితీకి దక్కేది వెన్నుపోటు మాత్రమే
అయినా మదిమూలల్లో ఎక్కడో చిన్న ఆశ
సమాజ గమనానికి మహాబోధిలా
నికార్శైన హృదయాలు
ఈ మహా వృక్షానికి వేర్లుగా
నిలబడకపోతాయా అని
ఎండల్లో నీడగా
హౌరుగాలికి సైతం బలంగా నిలిచి
మానవ బంధాలకు
జీవసారం నింపాలని ఆకాంక్షిస్తూ….
- కోగిల చంద్రమౌళి, 9573187218
- Advertisement -