Monday, September 15, 2025
E-PAPER
Homeసినిమాధనుష్‌ 'ఇడ్లీ కొట్టు' రిలీజ్‌కి రెడీ

ధనుష్‌ ‘ఇడ్లీ కొట్టు’ రిలీజ్‌కి రెడీ

- Advertisement -

ఇటీవల ‘కుబేర’తో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ని అందుకున్న హీరో ధనుష్‌ ‘ఇడ్లీ కొట్టు’ సినిమాతో అలరించబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తూ, డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రాన్ని డాన్‌ పిక్చర్స్‌, వండర్‌బార్‌ ఫిల్మ్స్‌ బ్యానర్స్‌ పై ఆకాష్‌ భాస్కరన్‌ నిర్మించారు. డైరెక్టర్‌గా ధనుష్‌కి ఇది నాలుగో మూవీ. ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఒకేసారి అక్టోబర్‌ 1న రిలీజ్‌ కానుంది. చాలామంది ఈ సినిమా తెలుగు రైట్స్‌ కోసం పోటీ పడ్డారు. ఫైనల్‌గా ధనుష్‌ కెరీర్‌లోనే హైయెస్ట్‌ ప్రైస్‌కి శ్రీ వేదక్షర మూవీస్‌ తెలుగు రైట్స్‌ని దక్కించుకుంది. శ్రీ వేదక్షర మూవీస్‌ బ్యానర్‌ ద్వారా నిర్మాత రామారావు చింతపల్లి తెలుగులో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఈ సినిమాని అక్టోబర్‌ 1న ధనుష్‌ కెరీర్‌లోనే హైయెస్ట్‌ థియేటర్స్‌లో గ్రాండ్‌ రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. తెలుగులో చాలా అగ్రెసీవ్‌గా ప్రమోట్‌ చేసి, సినిమాని భారీగా రిలీజ్‌ చేయబోతున్నాం. ఈ సినిమా తెలుగు రైట్స్‌ మాకు ఇచ్చినందుకు ధనుష్‌కి కతజ్ఞతలు’ అని అన్నారు. నిత్యా మీనన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అరుణ్‌ విజరు, షాలిని పాండే, సత్యరాజ్‌, రాజ్‌కిరణ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం: ధనుష్‌, నిర్మాతలు: ఆకాష్‌ భాస్కరన్‌, ధనుష్‌, సంగీతం:జీవీ ప్రకాష్‌ కుమార్‌, ఎడిటర్‌: ప్రసన్న, డీఓపీ : కిరణ్‌ కౌశిక్‌, యాక్షన్‌: పీటర్‌ హెయిన్‌, ఆర్ట్‌: జాకీ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -