Monday, September 15, 2025
E-PAPER
Homeక్రైమ్యూరియా బస్తాల కోసం వెళ్తూ…

యూరియా బస్తాల కోసం వెళ్తూ…

- Advertisement -

– రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు మృతి
– మహబూబాబాద్‌ జిల్లా గూడూరులో ఘటన
నవతెలంగాణ-గూడూరు

యూరియా బస్తాల కోసం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు మృతిచెందిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలంలో ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడూరు మండలం దుబ్బగూడెం గ్రామపంచాయతీకి చెందిన బానోత్‌ లాల్య(77), జోషితండాకు చెంది న ధరావత్‌ వీరన్న(46) రైతులిద్దరూ కలిసి యూరియా బస్తాలు తెచ్చుకోవడానికి బోద్దుగొండ గ్రామానికి బైక్‌పై వెళ్లారు. ఈ క్రమంలో జగన్నా యకులగూడెం క్రాస్‌ రోడ్‌ వద్ద మహబూబాబాద్‌ నుంచి గూడూరు వైపు వస్తున్న బొలేరో వాహనం వేగంగా వచ్చి బైక్‌ను ఢకొీట్టింది. బానోతు లాల్యకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా, దారావత్‌ వీరన్నకు గాయాలు కాగా మహబూబా బాద్‌ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఖమ్మం జిల్లా కేంద్రానికి తరలిస్తుండగా పిరిస్థితి విషమించి మృతిచెందా డు. డ్రైవర్‌ నిర్లక్ష్యంగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగింది. కాగా, మృతుల బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు బోలెరో డ్రైవర్‌ చుక్కలింగంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ గిరిధర్‌ రెడ్డి తెలిపారు. కాగా, ఇద్దరు రైతు కుటుంబాలను మాజీ ఎంపీ, బీఆర్‌ఎ స్‌ జిల్లా అధ్యక్షురాలు మాలోత్‌ కవిత పరామర్శిం చి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -