Monday, September 15, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఇజ్రాయిల్ దాడి..25 మంది పాలస్తీనియన్లు మృతి

ఇజ్రాయిల్ దాడి..25 మంది పాలస్తీనియన్లు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: సోమవారం ఉదయం ఇజ్రాయిల్‌ సైన్యం జరిపిన దాడిలో ఆరేళ్ల కవలపిల్లలతో సహా 25 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఇక నిన్న నివాస భవనాలపై జరిపిన బాంబు దాడిలో కనీసం 16 బహుళ అంతస్తుల భవనాలు విధ్వంసమయ్యాయి. ఈ దాడి వల్ల 53 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు.
కాగా, అక్టోబర్‌ 7 2023 నుండి ప్రారంభమైన దాడుల వల్ల 64,871 మంది మృతి చెందారు. 164,610 మంది గాయాలపాలయ్యారు. ఇదిలా ఉండగా.. ఐక్యరాజ్యసమితితో సహా పలు దేశాలు ఇజ్రాయిల్‌.. పాలస్తీనాపై దాడుల్ని ఆపాలని పిలుపునిచ్చాయి. అయినప్పటికీ ఇజ్రాయిల్‌ దాడుల్ని కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్‌తో సంబంధాలు తెంచుకోవాలని ముస్లిం దేశాలను ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియన్‌ కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -