Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడి ఉద్యోగుల అరెస్ట్ సరికాదు

అంగన్వాడి ఉద్యోగుల అరెస్ట్ సరికాదు

- Advertisement -

– భీంగల్ ప్రాజెక్టు ఉపాధ్యక్షురాలు యమున 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం నిర్వహించే తలపెట్టిన మంత్రులైన్ల ముందు ధర్నాలు కార్యక్రమంలో పాల్గొనకుండా అంగన్వాడి ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేయడం సరికాదని భీంగల్ ప్రాజెక్టు ఉపాధ్యక్షురాలు యమున అన్నారు. నిజామాబాద్ లో జరిగే ధర్నా కార్యక్రమానికి వెళ్లకుండా ఉదయమే భీంగల్ ప్రాజెక్టు ఉపాధ్యక్షురాలు యమున, మండల అధ్యక్షురాలు మంజుల తోపాటు పలువురు అంగన్వాడి టీచర్లను పోలీసులు అరెస్టు చేసి కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ కు  తరలించారు.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ వద్ద యమున, మంజుల విలేకరులతో మాట్లాడారు. అంగన్వాడి ఉద్యోగుల హక్కుల సాధన కోసం పోరాటం చేయకుండా ప్రభుత్వం పోలీసులతో అణిచివేసే ధోరణి ప్రదర్శించడం సమంజసం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తక్షణమే రూ.18వేల వేతనం, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ విద్యను అంగన్వాడి కేంద్రాల్లోనే నిర్వహించాలని, విద్య బోధన బాధ్యతను అంగన్వాడీ ఉద్యోగులకు ఇవ్వాలన్నారు. అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి, ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే వరకు తమ పోరాటం ఆగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -