నవతెలంగాణ – బిచ్కుంద
ఏకల్ గ్రామోత్తన్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా కంప్యూటర్ శిక్షణనను అందజేసి శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. దక్షిణ భారత్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి రాజేందర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా కంప్యూటర్ శిక్షణను ఇచ్చి శిక్షణ ను పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేసి సర్టిఫికెట్ల ద్వారా ఉపాధి పొందే అవకాశాలు ఉంటాయని అన్నారు.సంస్థ ద్వారా ఎలాంటి లాబా పేక్ష లేకుండా ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఇవ్వడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నామని అన్నారు. ఈ ప్రాంతంలోని వారికి ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఇస్తున్న గణేష్ ను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మల్లికార్జున్ అప్ప షెట్ కార్, సంస్థ సభ్యులు విజయ్ పాండే, శ్రీధర్ రెడ్డి, పాండురంగ రెడ్డి, నర్సింలు డాక్టర్, విష్ణు, రచ్చ శివకాంత్, డాక్టర్ రాజు, యాదవ్ ఉన్నారు.
కంప్యూటర్ కోర్స్ సర్టిఫికెట్లు అందజేత..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES