Monday, September 15, 2025
E-PAPER
Homeఆదిలాబాద్సీఈఐఆర్ ద్వారా 15 లక్షల విలువ గల సెల్ ఫోన్స్ బాదితులకు అందించిన ఎస్పీ

సీఈఐఆర్ ద్వారా 15 లక్షల విలువ గల సెల్ ఫోన్స్ బాదితులకు అందించిన ఎస్పీ

- Advertisement -

ఫోన్ పోతే సీఈఐఆర్ లో ఫిర్యాదు చేయండి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్

ప్రస్తుత సమాజంలో మొబైల్ ఫోన్ లేనిదే ఎలాంటి పని జరగని సందర్భంలో మనకు అత్యంత విలువైనది. తక్కువ సమయంలో ఎక్కువ పని చేసే సాంకేతిక పరికరం మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్లో అన్ని వివరాలు, అన్ని జ్ఞాపకాలు, అన్ని లావాదేవీలకు సంబంధించిన అప్లికేషన్లు ఉంటాయి. సాధారణంగా ప్రజలు మొబైల్ ఫోన్లు పోగొట్టుకోవడం, దొంగలించబడటం జరుగుతుంది. తిరిగి వాటిని సంపాదించాలంటే, ఈ సందర్భంలో బాధితులు వెంటనే https://www.ceir.gov.in అనే వెబ్సైట్ లో లేదా దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలియజేశారు.

జిల్లాలో ఇలా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి సంపాదించడం కోసం ప్రత్యేకంగా రికవరీ బృందాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. వీరు గత నెల రోజుల వ్యవధిలో దాదాపు వివిధ రాష్ట్రాల నుండి జిల్లాల నుండి బాధితులు పోగొట్టుకున్నటువంటి, దొంగలించబడిన 108 మొబైల్ ఫోన్ లను తిరిగిరాబట్టినట్లు తెలిపారు. సోమవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశం మందిరంలో జిల్లాలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న, చోరీకి గురైనటువంటి బాధితులకు 108 మొబైల్ ఫోన్లు (దాదాపు 15 లక్షల విలువ చేసే) వివిధ ప్రాంతాల నుండి తెప్పించి బాధితులకు తిరిగి అందజేశారు. జిల్లాలో ఇప్పటివరకు 1050 మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు. 

ఫోన్ లు కొనేముందు జాగ్రత్త

బాధితులు మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని ఫిర్యాదుకు ఎలాంటి మీసేవ సెంటర్లలో చలాన్లు కట్టవలసిన అవసరం లేదని తెలిపారు. మొబైల్ ఫోన్ దుకాణాల యజమానులు రిపేరింగ్ దుకాణాల యజమానులు మొబైల్ ఫోను కొనే ముందు మొబైల్ ఫోన్ యజమాని అనుమతి సరైన పత్రాలు తీసుకోవాలి, దొంగ మొబైల్ ఫోన్లు కొన్న ఎడల వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ముఖ్యంగా రాబట్టిన మొబైల్ ఫోన్లు ఉత్తర భారతదేశంలో ఉండటం వాటిని ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో తిరిగి రాబట్టడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో  ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్, ప్రత్యేక బృందం సభ్యులు ఆర్ఎస్ఐ పి గోపి కృష్ణ, ఎంఎ రియాస్, మజీద్, త్రిశూల్, అన్వేష్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -