Monday, September 15, 2025
E-PAPER
Homeక్రైమ్పోచారం ప్రాజెక్టులో పడి యువకుడు మృతి..

పోచారం ప్రాజెక్టులో పడి యువకుడు మృతి..

- Advertisement -

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
ప్రమాదవశాత్తు పోచారం ప్రాజెక్టులో పడి యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం రోజు సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన  వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ పట్టణానికి చెందిన షేక్ మహబూబ్ (20) తన స్నేహితులతో కలిసి పొంగిపొర్లుతున్న పోచారం ప్రాజెక్టు సందర్శించడానికి రావడం జరిగింది. ప్రాజెక్టు నుండి నీరు ఫ్లో అవుతున్న  దిగువ భాగంలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందడం జరిగిందని ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం  అనంతరం మృతికి గల కారణాలు తెలుస్తాయని ఎస్ఐ పేర్కొన్నారు. మెదక్ పట్టణంలో అంబులెన్స్ డ్రైవర్ గా యువకుడు పనిచేస్తాడని సమాచారం. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -