Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ ఉద్యోగుల జేఏసీకి కృతజ్ఞతలు..

తెలంగాణ ఉద్యోగుల జేఏసీకి కృతజ్ఞతలు..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూ భారతి చట్టం – 2025 అమలులోకి తీసుకురావడంతో పాటు గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా, గ్రామ పాలన అధికారుల వ్యవస్థ తీసుకురావడానికి విశేష కృషి చేసిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్  వి లచ్చి రెడ్డి ని యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామ పాలన అధికారులు ఆదివారం హైదరాబాదులో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారిని సన్మానించి యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రసాదము అందజేసి  ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జిపిఓ వ్యవస్థ వలన గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతుందని తెలిపారు   ఈ సందర్భంగా వారు డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ కి, తెలంగాణ తహాసీల్దార్స్ అసోసియేషన్ కి , తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కి  హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. 

ప్రభుత్వం మాపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా మేము ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వానికి, రైతాంగానికి ఒక వారధి లా ఉంటూ రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.రామకృష్ణ, టీజీటీఏ అధ్యక్ష కార్యదర్శులు రాములు, పాక రమేష్ , టీజీఆర్ఎస్ఏ అధ్యక్ష కార్యదర్శులు బాణాల రామ్ రెడ్డి, బిక్షం, టీజీటీఏ మహిళా విభాగం అధ్యక్షురాలు రాధ, టీజీటీఏ రాష్ట్ర నాయకులు పూల్ సింగ్, టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర కోశాధికారి మల్లేష్,టీజిఆర్ఎస్ఏ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు  కే వెంకటరెడ్డి టిజిటిఏ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు  పి రవికుమార్, గ్రామ పాలన అధికారుల సంఘం నాయకులు తేల్జూరి శ్రీశైలం మరియు గుర్రాల బాలకృష్ణ, కే శ్రీనివాస్ ,మద్ది వెంకట నరసింహారెడ్డి , సురేశ్,వెంకటేష్, అహ్మద్ పాషా  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -