Thursday, May 8, 2025
Homeతెలంగాణ రౌండప్తాడిచెర్లలో ఏటిఎమ్ సేవలు ప్రారంభం..

తాడిచెర్లలో ఏటిఎమ్ సేవలు ప్రారంభం..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు: మండల కేంద్రమైన తాడిచెర్లలో కేడిసిసీ బ్యాంకు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏటిఎమ్ సేవలు  ప్రారంభమైనట్లు కేడిసిసీ బ్యాంకు మేనేజర్ పంతకాని వెంకటరాజం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేడిసిసీ బ్యాంకు వధ్జ ఏర్పాటు చేసిన ఏటిఎమ్ సేవలతో పాటు బ్యాంకు సేవలను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అఖిల భారత స్థాయిలో గత దశాబ్దపు అత్యుత్తమ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు గా గుర్తింపు పొంది ఏడు సంవత్సరాలుగా అనేక అవార్డులు అందుకున్నట్లు పేర్కొన్నారు. కె.డి.సి.సి. బ్యాంకులో డిపాజిట్ చేయడం ద్వారా ఇతర బ్యాంకుల కంటే అత్యధికంగా వడ్డీ 7.60 శాతం సీనియర్ సిటిజన్స్ కు 8.10 శాతం లబ్ది పొందవచ్చునని తెలిపారు. బంగారు ఆభరణాల హమీ పై రుణ సౌకర్యం ఉందన్నారు. డిపాజిట్లపై రూ.5లక్షల వరకు డిఐసిజిసి చే ఇన్సూరెన్స్ భద్రత పాటు బ్యాంకు అన్ని శాఖలలో లాకర్స్ సౌకర్యం ఉన్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -