Monday, September 15, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఫోటో ట్రేడ్ ఎక్స్ పో పోస్టర్ ఆవిష్కరణ..

ఫోటో ట్రేడ్ ఎక్స్ పో పోస్టర్ ఆవిష్కరణ..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండల కేంద్రంలో ఫోటో, వీడియో గ్రాఫర్ ఆధ్వర్యంలో ఈ నెల 19,20,21 వ తేదీలలో ఓం కన్వెన్షన్ హల్ హైద్రాబాద్ నందు నిర్వహించే తెలంగాణ ఫోటో ట్రేడ్ ఎక్స్ పో పోస్టర్ నీ మండల అధ్యక్షులు దుమల్ల ప్రశాంత్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫోటోగ్రఫీ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో ఫోటోగ్రఫీ ఒక సృజనాత్మక పూర్తిగా మారిందని, ఇటువంటి ఎక్స్ పో లకు కొత్త పరికరాలు,కెమెరాలు, లెన్స్, డ్రోన్స్,ప్రింటింగ్ పరికరాలు,లైటింగ్ సిస్టమ్,ఫోటో ఎడిటింగ్ సాప్ట్వేర్, స్టూడియో మోడల్స్ ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.

ఆసక్తి గల ఫోటోగ్రాపర్స్ ఈ యొక్క ఎక్స్ పో లో పాల్గొని తమ యొక్క నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కోరారు.. ఈ కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి ఉపారపు శేఖర్ , ఉపాధ్యక్షులు గుగ్లవత్ వసంత్, పోతూ వేణుగోపాల్,భీమేష్, రవి ,శ్రీనివాస్ ,శేఖర్ ,కస్తూరి సాయి,మహేష్ ,స్వామి, పవన్ చారి,వినోద్,మారుతి, సాయి ఫోటో, వీడియో గ్రాఫర్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -