Thursday, May 8, 2025
Homeతెలంగాణ రౌండప్ఆదర్శలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం..

ఆదర్శలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం..

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి : తెలంగాణ ఆదర్శ పాఠశాల  జూనియర్ కళాశాల జక్రాన్ పల్లి లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేయబడిందని ప్రిన్సిపాల్ కె. సుధారాణి తెలియచేయడం జరిగింది. ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి 05 మే 2025 నుండి 20 మే 2025 వరకు అందుబాటులో ఉంటుంది. ఎంపికైన విద్యార్థుల జాబితా 26 మే 2025న సంస్థ నోటీసు బోర్డులో ప్రదర్శించబడుతుందని తెలిపారు. సర్టిఫికెట్ల ధృవీకరణ మరియు ప్రవేశ ప్రక్రియ పూర్తి చేయడం 27 నుండి 31 మే 2025 వరకు పూర్తవుతుంది. సీట్ల కేటాయింపు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో మెరిట్ మరియు రాష్ట్ర ప్రభుత్వ రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా ఉంటుందని చెప్పారు. ఎంపికైన విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత నోట్‌బుక్‌లు, EAPCET/NEET కోచింగ్, కెరీర్ కౌన్సెలింగ్, బాలికలకు హాస్టల్ సౌకర్యం, మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ మరియు కుట్టు అల్లికలు వృత్తిపరమైన కోర్సులు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు కూడా లభిస్తాయి అని ప్రిన్సిపాల్ కె సుధారాణి తెలియజేయడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -