- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని ఇస్సపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం యందు సోమవారం 30 ఫీట్ల ఎత్తుగల నూతన ఉట్ల గుంజతో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించినారు. ఉట్లు కొట్టే కార్యక్రమం నిర్వహించినారు. ఇక్కడ సుమారుగా 800 సంవత్సరాల కింద చేసిన ఉట్ల గుంజ చిన్నదిగా కావడంతో విశ్వబ్రాహ్మణ (వడ్రంగి )కులస్తులు 30 ఫీట్ల ఎత్తుగల కర్ర కు మెరుగులు దిద్దినారు. ప్రతి సంవత్సరం వైష్ణవ దేవాలయాలలో అష్టమి రోహిణి కలిసిన రోజు కృష్ణాష్టమి జరుపుతారని గ్రామ అభివృద్ధి కమిటీ, మందిర కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -