Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సిపి సెట్ లో బిచ్కుంద విద్యార్థినికి ఏడవ ర్యాంకు

సిపి సెట్ లో బిచ్కుంద విద్యార్థినికి ఏడవ ర్యాంకు

- Advertisement -

నవతెలంగాణ – బిచ్కుంద 
ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సిపి సెట్‌ లో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) లో బిచ్కుంద విద్యార్ధులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. సోమవారం ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్ అశోక్ అధ్యాపకులతో కలిసి సన్మానించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ వృక్షశాస్త్రం విభాగంలో వట్నాల్ వార్ నిఖిత 07వ ర్యాంకు, హిందీ విభాగంలో నిహాల్ 54వ ర్యాంక్, మౌలానా 80వ ర్యాంక్ సాధించారని ర్యాంకులను సాధించిన విద్యార్ధులకు ఉచిత శిక్షణ అందించిన అధ్యాపకుల కృషి ఎంతో ఉందని  ప్రిన్సిపల్‌, అధ్యాపకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో  కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశం, వృక్షశాస్త్ర విభాగాధిపతి రఘునాథ్, అధ్యాపకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -