ఎంఆర్ పిఎస్ మండల అధ్యక్షులు మంతెన చిరంజీవి
నవతెలంగాణ – కాటారం
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు వికలాంగులకు ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.4000, వికలాంగులకు రూ.6000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలనీ ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం తహసీల్దార్ కార్యాలయం ముట్టడి కి ఎంఆర్పియస్ మండల అధ్యక్షులు మంతెన చిరంజీవి ఆధ్వర్యంలో ప్రయత్నించారు. వెంటనే తహసీల్దార్ స్పందించి గేటు దగ్గరికి వచ్చి వికలాంగుల తో మాట్లాడారు.అనంతరం వికలాంగుల నుండి వినతిపత్రం తీసుకొని ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తాని హామీ ఇచ్ఛారు.
ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మెనిఫెస్టో లో పేర్కొన్న విధంగా వికలాంగులకు పెన్షన్ ఇవ్వాలని, అంతేగాక సదరం సర్టిఫికెట్ ఉన్న ప్రతి ఒక్కరికి కొత్త పెన్షన్ మంజూరు చేయాలని, ముఖ్య మంత్రి వికలాంగుల పరిస్థితి ని పటించుకోవడం లేదనీ, ఈ విషయం లో ఐటీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ బాబు చొరవ తీసుకొని వికలాంగులకు, వితంతువులకు, వృద్ధులు, ఒంటరి మహిళలకు పెన్షన్ పెంచి, సదరం సర్టిఫికెట్స్ ఉన్న వారికి కొత్త గా పెన్షన్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వికలాంగులను, ప్రజాసంఘాలు, ఎంఆర్పయస్, ఎంఎస్పి లతో ఉద్యమం తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్ఛరించారు.
ఈ కార్యక్రమం లో విహెచ్ పిఎస్ మండల అధ్యక్షులు గోగు రవీందర్, జిల్లా ఉపాదక్షులు దుర్గం శంకర్, దళిత నాయకులు వేమునూరి జక్కయ్య, సమ్మయ్య, వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, గీత, నేత, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.