అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్
నవతెలంగాణ – కంఠేశ్వర్
అరెస్టులతో అడ్డుకోవాలని చూసిన అంగన్వాడీల ఆందోళన ఆగకుండా ధర్నాకు తరలి వెళ మరి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించడం జరిగిందని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం మంత్రుల ఇళ్ల ముందు ధర్నాలకు పిలుపునివ్వడంతో ఒకరోజు ముందు నుండే అంగన్వాడి నాయకులను టీచర్లను అరెస్టులు చేసి పోలీస్ స్టేషనులకు తరలించి నిర్బంధించినప్పటికీ పట్టు వదలకుండా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇంటిముందు ధర్నాకు పెద్ద ఎత్తున అంగన్వాడి టీచర్లు తరలివచ్చారు.
అంగన్వాడీ ఉద్యమంలో పాల్గొనటానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ రోజు ముందుగానే రహస్య ప్రాంతానికి వెళ్లి ధర్నా సమయానికి మారువేషంలో బుర్కాదరించి హాజరైనప్పటికీ నాలుగో టౌన్ పోలీసులు నూర్చాను అరెస్ట్ చేసి ఈడ్చ కు వెళ్ళటం జరిగింది. అయినప్పటికీ అంగన్వాడి కార్యకర్తలు పట్టు వదలకుండా వినాయక్ నగర్ లోని బసవ గార్డెన్ నుండి ధర్నా చౌక్ వరకు పెద్ద ఎత్తున ప్రదర్శనగా వచ్చి అక్కడ బైఠాయించారు. అరెస్టు చేసిన తమ నాయకులను అంగన్వాడీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో ఎన్టీఆర్ చౌరస్తాలో రాస్తారోకోకు పూనుకోవటం జరిగింది. దాంతో పోలీసులు అరెస్టు చేసిన నాయకులను కార్యకర్తలను విడుదల చేసిన తర్వాత ఉద్యమాన్ని విరమించుకోవడం జరిగింది.
అరెస్ట్ అయిన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ధర్నా శిబిరానికి చేరుకొని అక్రమ అరెస్టులతో అంగన్వాడీల ఉద్యమాన్ని అంశాలని చూడటం ప్రభుత్వానికి తగదని అన్నారు. సమస్యల పరిష్కారం పైన చూపాల్సిన శ్రద్ధ అరెస్టుల పైన పెట్టడం సర్ సరైంది కాదని అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని ఇప్పటికైనా ప్రభుత్వం ప్రీ ప్రైమరీస్ కేంద్రాల ను అంగన్వాడీ కేంద్రాల కు కేటాయించాలని, ఫోటో క్యాప్చర్ విధానాన్ని రద్దు చేయాలని, అంగన్వాడీ కార్యకర్తలకు పెంచుతామన్న 18 వేల వేతనాన్ని వెంటనే అమలు జరిపాలని అన్నారు. రిటైర్డ్ ఐనా ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను పెన్షన్ను ఇవ్వాలని లేని యెడల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
అంగన్వాడీలకు అరెస్టులు కేసులు కొత్త కాదని సిఐటియు ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక పోరాటాలను చేసిన అనుభవం వారికి ఉందని అందువల్ల గత ప్రభుత్వాల మాదిరిగా ప్రభుత్వం నిర్బంధాల ద్వారా ఉద్యమాల్ని అంచాలనుకోవటం అవివేకం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలతో తమ నిరసనను వెలగక్కారు. ఇందులో అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి స్వర్ణ, జిల్లా కోశాధికారి చంద్రకళ జిల్లా ఉపాధ్యక్షులు మంగాదేవి, జిల్లా నాయకులు వాణి, విజయ, లక్ష్మి, వసంత, సూర్య కళ, రాజ్యలక్ష్మి, లావణ్య తదితరులతోపాటు ఆయా మండలాల నుండి పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
అరెస్టులతో అడ్డుకోవాలని చూసినా.. ఆగని అంగన్వాడీల ఆందోళన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES