Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యూరియా సమస్యను పరిష్కరించాలి

యూరియా సమస్యను పరిష్కరించాలి

- Advertisement -

ఉల్లి రైతు నడిపి కాజా కు పంట నష్ట పరిహారం ఇవ్వాలి
రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాల్ రెడ్డి, పరమేశ్వర చారి
నవతెలంగాణ – వనపర్తి 

యూరియా సమస్యను పరిష్కరించాలని, ఉల్లి రైతు నడిపి కాజా కు పంట నష్ట పరిహారం ఇవ్వాలని రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాల్ రెడ్డి, పరమేశ్వర చారి అన్నారు. తెలంగాణ రైతు సంఘం (Aiks) వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యూరియా సమస్యను పరిష్కరించాలని, ఉల్లి రైతుకు పంట నష్ట పరిహారం చెల్లించాలని ప్రజావాణిలో కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి బాల్ రెడ్డి, ఎం పరమేశ్వర చారి మాట్లాడుతూ జిల్లాలో యూరియా సమస్య ఉండడం ద్వారా సింగల్ విండోలు, ఆగ్రో కేంద్రాలలో రైతులు క్యూ లైన్ లో నిలబడి అవస్థ పడుతూ ఇబ్బందులకు గురవుతున్నారు.

కాబట్టి ప్రభుత్వం స్పందించి అవసరమైన యూరియా రైతులకు అందించాలని వారు కోరారు. వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన ఉల్లి రైతు నడిపి కాజా పది ఎకరాలలో ఉల్లి వేసి భారీ వర్షాలకు నష్టపోయారన్నారు. మార్కెట్కు తీసుకెళ్తే ధర లేకపోవడంతో రైతు 10 లక్షల పైగా పెట్టుబడి పెట్టి నష్టపోయారన్నారు. కాబట్టి అధికారులు స్పందించి ఆ రైతుకు నష్టపరిహారం చెల్లించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారన్నారు. కలెక్టర్ స్పందిస్తూ సంబంధించిన అధికారులు పరిశీలన చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాల్ రెడ్డి, ఎం పరమేశ్వర చారి, జిల్లా ఉపాధ్యక్షులు మహబూబ్ పాషా, ఉల్లి రైతు నడిపి కాజా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -