Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్మిక, కర్షక సదస్సుకు బయలుదేరిన రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేవేందర్

కార్మిక, కర్షక సదస్సుకు బయలుదేరిన రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేవేందర్

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి
ఢిల్లీలో జరిగే కార్మిక, కర్షక సదస్సుకు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేవేందర్ హాజరుకానున్నారు. తెలంగాణ రైతు సంఘం (Aiks) వనపర్తి జిల్లా కమిటీ నుండి ఈనెల 16న ఢిల్లీలో జరిగే కార్మిక కర్షక సదస్సుకు వనపర్తి రైతు సంఘం నుండి జిల్లా ఉపాధ్యక్షులు జి దేవేందర్ వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీలో కార్మికులు రైతు సమస్యలను పరిష్కరించాలని ఐక్య ఉద్యమాలు నిర్వహించడం కోసం కార్మిక కర్షక సదస్సు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. సదస్సు తర్వాత దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్వహిస్తామని వారున్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -